ఉత్తర ప్రదేశ్‌లోని లబ్ధిరుల కోసం ఆర్థిక సహాయం విడుదల

PM Modi releases financial assistance under PMAY-Gramin for beneficiaries in Uttar Pradesh

న్యూఢిల్లీ: ప్రధాని మోడి ఉత్తరప్రదేశ్‌లోని పేద‌ల ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేశారు. ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగీ ఆదిత్య‌నాథ్ స‌మ‌క్షంలో ల‌క్నోలో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొని నిధుల‌ను విడుద‌ల చేశారు. కాగా, ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజ‌నగ్రామీణ్ (PMAY-G) ప‌థ‌కం కింద పేద‌ల ఇండ్లు నిర్మించుకోవ‌డానికి ఈ నిధుల‌ను అంద‌జేయ‌నున్నారు. తాజా నిధుల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 6.1 ల‌క్ష‌ల మంది పేద‌లు ల‌బ్ధిపొంద‌నున్నారని అధికారులు తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/