ఉత్తరాదిన వెలుస్తున్న కొత్త పార్టీలు

siromani akali dal (taksali) party
siromani akali dal (taksali) party

అమృత్‌సర్‌: ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో అనేకానేక మార్పులు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కొత్త కూటములు, పార్టీలు పుట్టుకొస్తున్నాయి. పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టారు. శిరోమణి అకాలీ దళ్‌ బహిష్కృత నేతలు కూటమిగా ఏర్పడి కొత్త పార్టీ పెట్టారు. శిరోమణి అకాలీ దళ్‌( తక్సలి) పేరుతో నూతన పార్టీని ఆవిష్కరించారు. అకాళీ దళ్‌ సీనియర్‌ లీడర్లు రంజిత్‌ సింగ్‌ బహంపుర, రతన్‌ సింగ్‌ అజ్నాల, సేవా సింగ్‌ సెఖ్వాన్‌ ఆధ్వర్యంలో ఈ కొత్త పార్టీ ఏర్పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలోకి దిగుతామని శిరోమణి అకాలీదళఖ (తక్సలి) పార్టీ నేతలు ప్రకటించారు.