ఉత్తరప్రదేశ్‌లో విషాదం

breaking newsbreaking news
breaking news

ఉత్తరప్రదేశ్‌ : కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. చందౌలీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ట్రక్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న దళిత కాలనీలోకి ట్రక్కు దూసుకెళ్లినట్టు సీనియర్ పోలీసు అధికారి దేవేంద్ర నాథ్ తెలిపారు. మృతి చెందిన వారిలో మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.