ఉత్తరకొరియాను నాశనం చేసే సత్తా అమెరికాకు ఉంది: రష్యా

serge lavarov
serge lavarov

మాస్కో: ఐక్యరాజ్యసమితి వేదికగా తొలిసారి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది.
అమెరికా వ్యాఖ్యలపై తమకెలాంటి అనుమానం లేదని, ఉత్తరకొరియాను నిస్సందేహంగా నామరూపాల్లేకుండా చేస్తుందని రష్యా తెలిపింది. ఆ దేశాన్ని నాశనం చేయగల సత్తా అమెరికాకు ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గె లావరోవ్‌ స్పష్టం చేశారు. పరస్పర సహకారంతోనే అన్ని దేశాలు పనిచేయాలని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రశంసించారు.