ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్న గుజ్జ కృష్ణ

సైఫాబాద్: బిసి రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిసి సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం తెలంగాణ పిసిసికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం గాంధీభవన్‌లో టి పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా గుజ్జ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిసిలను రాజకీయంగా ఎదగనీయకుండా చేసేందుకు పంచాయితీరాజ్ ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లను తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం జరిగిందని ఆరోపించారు. రిజర్వేషన్ల తగ్గింపుపై బిసి సంఘాలు న్యాయపోరాటం, ప్రజా పోరాటం నిర్వహిస్తాయని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతును కోరడం జరిగిందని ఆయన చెప్పారు.