ఉగ్ర‌దాడిలో పోలీసులు మృతి

BREAKING NEWS
BREAKING NEWS

జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతిచెందారు. అరహమా ప్రాంతంలో నలుగురు పోలీసులను కాల్చిచంపిన ఉగ్రవాదులు ఆయుధాలతో పరారయ్యారు. ఓ పోలీసు వాహనానికి మరమ్మతులు చేయడానికి డీఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిన ఎస్కార్ట్ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. అనంతరం మూడు ఆయుధాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి.