ఉగ్రవాదుల ఏరివేతకు ఎన్‌ఎస్‌జి కమాండోలు

NSG
NSG

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లో పేట్రేగిపోతున్న ఉగ్రకార్యకలాపాలనుకట్టడిచేసేందుకు కేంద్రం ఎన్‌ఎస్‌జి కమాండోలను రంగంలోనికి దించుతోంది. కాశ్మీర్‌లోయలోనికి ఇప్పటికే ఒక ఎన్‌ఎస్‌జి కమాండోల టీమ్‌ను కేంద్రం పంపించింది. బ్లాక్‌ క్యాట్‌ కమాండోలుగా పిలిచే ఎన్‌ఎస్‌జిలు మిలిటెంట్‌ కార్యకలాపాలు సమూలంగా నాశనంచేస్తారని కేంద్రం ధీమా వ్యక్తంచేస్తోంది. జమ్ముకాశ్మీర్‌లో గవర్నర్‌పాలన ప్రారంభం కావడంతో ఇకపై ఉగ్రవాదుల ఏరివేతకార్యక్రమాలుప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీమ్‌ కఠోరశిక్షణపొందుతున్నట్లు తేలింది. రాష్ట్రంలో నాలుగోసారి గవర్నర్‌పాలన కిందకు వచ్చింది. బిజెపి తన మిత్రపక్షం పిడిపికి మద్దతు ఉపసంహరించుకున్నతర్వాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామాచేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. దీనితో గవర్నర్‌పాలన అనివార్యం అయింది. ఈ టీమ్‌లు జమ్ముకాశ్మీర్‌పోలీసుల పర్యవేక్షణలో పనిచేస్తాయి. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల నిర్మూలనకు ఎన్‌ఎస్‌జి విస్తృతంగా పనిచేస్తుందని అన్నారు. ఈరాష్ట్రంలో ఉగ్రవాదం ఏరివేతకు సంబంధించి రక్షణదళాలకు చావోరేవో అన్నట్లుగా ఉంటుంది. సైన్యం సహకారంతోను, పారామిలిటరీ సిబ్బందికి తోడు ఇపుడు ఎన్‌ఎస్‌జి కమాండోలుసైతం రంగంలోనికి దిగుతున్నారు.ఇటీవలికాలంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదుల ఏరివేతపరంగా మనసైనికులు కూడా చనిపోతుండటం వంటి సంఘటనలతో కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కమాండోలకు అత్యాధునికమైన హెక్లర్‌, కోచ్‌ ఎంపి5 సబ్‌మెషిన్‌గన్లు, స్నిఫర్‌రైఫిళ్లు, రాడార్లు, సి-4పేలుడు సామగ్రి వంటివాటిని వినియోగిస్తారు. ఉగ్రవాదులను ముట్టడించి అక్కడిక్కడే తుదముట్టించడంతో వీరికి సాయుధ శిక్షణ ఇచ్చారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌తర్వాత 1984లో తొలిసారిగా ఎన్‌ఎస్‌జిని ఏర్పాటుచేసారు. పంజాబ్‌లోని అమృతసర్‌ స్వర్ణదేవాలయంలో ఉగ్రవాదులను ఏరివేతసందర్భంగా వీరి సేవలను వినియోగించింది. బ్లాక్‌క్యాట్‌ కమాండోలు ఉగ్రవాదులను ఏరివేసేందుకుమాత్రమే వినియోగించారు. ముంబైలోని 26/11 దాడుల్లోసైతం వీరు ధైర్యసాహసాలనుప్రదర్శించారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై 2016 జనవరిలో జరిగిన దాడిలోసైతం బ్లాక్‌క్యాట్‌ కమాండోలు ధైర్యసాహసాలుప్రదర్శించారు. అలాగే గుజరాత్‌లోని అక్షరధామ్‌ మందిరంపై ఉగ్రవాదులదాడిసమయంలో కూడా వీరు తెగువచూపించి మట్టుబెట్టారు. ఎన్‌ఎస్‌జిలో సుమారు 7500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.