ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు నుంచి రాలేదు: బిఎస్‌ఎఫ్‌

 

BORDER
న్యూఢిల్లీ: మైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దులను దాటి దేశంలోకి చొరబడలేదని సరిహద్దు భద్రతాదళం (బిఎస్‌ఎఫ్‌) స్పష్టం చేసింది. ఈమేరకు బిఎస్‌ఎఫ్‌ అధికారులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక సమర్పించారు.ఉగ్రవాదులు ప్రవేశించారని అనుమానిస్తున్న పఠాన్‌కోట్‌ సరిహద్దు గ్రామైన బమియాల్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దును వెంట బిఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డికె పాఠక్‌ పర్యటించారని బిఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. గతనెల 30, 31 తేదీల్లో చేసిన పెట్రోలింగ్‌ వివరాల సహా సమగ్ర సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిపారు. కాగా అంతర్జాతీయ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ లేని చోట్ల కాపలా కోసం మరొక 2 వేల మంది సిబ్బందిని బిఎస్‌ఎఫ్‌ నియమించనుందని తెలిసింది.