ఉగ్రదాడిపై భారత్‌కు సమాచారం ఇచ్చాం, మీడియాకు కాదు : పాక్‌

మీడియాకు లీక్‌ చేయడంపై పాకిస్థాన్‌ అసంతృప్తి
హైదరాబాద్‌ : భారత్‌లో ఉగ్రదాడి చేసేందుకు ముష్కరులు వచ్చారని తాము భారత్‌కు సమాచారం ఇచ్చిన విషయాన్ని పాకిస్థాన్‌ అధికారికంగా స్పష్టం చేసింది. ఆ విషయాన్ని మీడి యాకు లీక్‌ చేయడంపై పాక్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ విషయంపై పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ సలహాదారు సత్రాజ్‌ అజీజ్‌ మీడియాలో  ప్రకటన చేశారు. తాము ఉగ్రవాద నియంత్రణ విషయంలో ఎంత స్పష్టం ఉన్నామన్న విషయం ఇప్పుడు స్పష్టమైందన్నారు. ముఖ్యంగా పాక్‌ ఇతర దేశాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో బాధ్యతగా ఉంటుందన్నారు. అదే కోణంలో భారత్‌లో దాడులు చేయడానికి వెళ్లారన్న విషయం తమ దృష్టికి రాగానే భారత్‌ను అప్రమత్తం చేశామన్నారు. దాం తో భారత్‌లో దాడులను నివారించగలిగామన్నారు. భారత దేశంలో శివరాత్రి సందర్భంగా ఉగ్రదాడి జరుగనుందని పాక్‌ హెచ్చరించింది. పాక్‌ నుంచి 10 మంది ముష్కరులు సముద్ర మార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించారన్నారు. ఆ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఉగ్రవాద దాడులను తిప్పి కోట్టండి అని పాక్‌కు చెందిన నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ నాసిర్‌ ఖాన్‌ స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకు భారత్‌లో ఉగ్రదాడులను వెనుక నుంచి ప్రోత్సహించిన పాకిస్థాన్‌ హెచ్చరికలు చేయడం ఒకంత ఆశ్చర్యం కల్గించినప్పటికి భారత అప్రమత్త్మమైంది.  పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఎంతటి అనర్థాలు జరిగాయో అందరికి తెలిసిందే. ఒక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కారణంగానే భారత్‌-పాక్‌ల మద్య యుధ్ధ వాతవరణం నెలకొంది. ఇప్పుడు పాక్‌ అధికారికంగా తమ దేశం నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని హెచ్చరించింది. పాక్‌ చెప్పిన మేరకు తనిఖీలు చేశారు. ఉగ్రవాదులు గుజరాత్‌లోని కచ్‌ వద్ద దేశంలోకి చోరబడ్డట్లు స్పష్టమైంది. పాకిస్థాన్‌ నుంచి లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన పది మంది ఉగ్రవాదులు దేశంలోకి చోరబడ్డారు. సముద్ర మార్గం గుండా వారు గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం వద్ద దేశంలోకి వచ్చారు. వారు ప్రయాణించిన పడవను కూడా తీర ప్రాంత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ విషయంపై పాక్‌ మరోమారు అధికారిక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.