ఉగ్రదాడిని ఖండించిన‌ సెలబ్రిటీలు

celebrities anger over pulwama attacks
celebrities anger over pulwama attacks

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం సీఆర్పీఎఫ్‌ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడితో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్డారు. ఈ దాడిని రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించారు. ఉగ్రవాదాన్ని ఓడించడంలో అమెరికా కూడా భారత్‌కు అండగా ఉంటామని తెలిపింది. ఐతే ఇంతటి దారుణమైన చర్యని సినిమా సెలబ్రిటీలు కూడా ఖండిస్తున్నారు. కేవలం బాలీవుడ్‌ వారే కాకుండా, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు పుల్వామా ఘటనని తీవ్రంగా ఖండించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా వారు ఆకాంక్షించారు. వీరిలో పవన్‌కళ్యాణ్‌, సల్మాన్‌ఖాన్‌, ప్రియాంక చోప్రా, అక్ష§్‌ుకుమార్‌, అనుష్కశర్మలు ఉన్నారు.