ఉక్రెయిన్‌లో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి

File
File

ఉక్రెయిన్‌లో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి

ఉక్రెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ విద్యార్థులు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఈ మధ్యే మూడు నెలల సెలవులకు వీరు స్వస్థలాలకు వచ్చి తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి సముద్రపు ఒడ్డున బీచ్‌ వాలీబాల్‌ ఆడుతున్నారు. ఇంతలో బాల్‌ సముద్రంలో పడింది. దానిని తీసుకువచ్చేందుకు ముఖేష్‌ అనే యువకుడు సము ద్రంలోకి దిగాడు. అతడు నీళ్లలో కొట్టుకుపోతుండగా కాపాడటానికి శివకాంత్‌, అశోక్‌లు వెళ్లారు. ప్రమాదంలో ముఖేశ్‌ క్షేమంగా బయటపడగా, అతడ్ని కాపా డటానికి సముద్రంలోకి వెళ్లిన ఇద్దరు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. శివకాంత్‌రెడ్డిది హైదరాబాద్‌ హయత్‌నగర్‌ కుంట్లూర్‌ మండలం శివశంకర్‌ కాలనీ కాగా, అశోక్‌ది కడపజిల్లా రైల్వే కోడూరు. గత నెల శివకాంత్‌రెడ్డి సెలవులు రావ డంతో 45 రోజులు కుంట్లూరు గ్రామంలో గడిపి ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్‌ నుంచి ఉక్రెయిన్‌ వెళ్లాడు. వెళ్లిన 19 రోజులకే శివకాంత్‌రెడ్డి మృతి చెందడంతో బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.