ఈ సారి సామాన్యుల‌కు మేలు చేసే నిర్ణ‌యాలు!

GST
GST

న్యూఢిల్లీః ఈ నెల 10న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు మేలు కలిగే నిర్ణయాలను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఒకే దేశం.. ఒకే పన్ను.. ఇదే ఆలోచనతో మోదీ ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తెచ్చింది. అప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై జీఎస్టీ పెను ప్రభావం చూపింది. చిరు వ్యాపారులు మొదలుకొని వినియోగదారుల వరకు అనేక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం కేంద్రాన్ని ఆలోచనలో పడేసింది. ఐతే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ప్రతినెల సమావేశం అవుతున్న జీఎస్టీ మండలి ఇప్పటివరకు సుమారు 100 వస్తువుల ధరలను తగ్గించింది. ఇదే క్రమంలో ఈ నెల 10న మరోసారి భేటీ కానుంది. మధ్య తరగతికి ఉపసమనం కలిగించేలా కౌన్సిల్ నిర్ణయాలు ఉంటాయని సమాచారం.