ఈ వికెట్‌పై ఇరు జ‌ట్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసే అవ‌కాశం:గంగూలీ

sourav ganguly
sourav ganguly

కోల్‌కతా: భారత-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరిగే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ను మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పరిశీలించాడు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఈ వికెట్‌పై ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని, ఇది మంచి వికెట్ అని తెలిపారు. అలాగే పరిపాలకుడిగా కంటే ఆటగాడిగా ఉండడమే కష్టమని అన్నాడు. ‘పరిపాలనలో ఓసారి విఫలమైనా మరో అవకాశం ఉంటుంది. కానీ ఆటగాడికి అలాంటి దేమీ ఉండదు’ అని దాదా తెలిపారు.