ఈ నెల 9న సీఎం చంద్ర‌బాబు చిత్తూరు ప‌ర్య‌ట‌న‌

 

 

AP CM Chandrababu Naudu
Chandrababu

చిత్తూరు : ఈ నెల 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆరోజు ఉదయం శ్రీ సిటీ సమీపంలో వరదయ్యపాలెం మండలం చిన్నపండూరు వద్ద అపోలో టైర్ల పరిశ్రమకు శంఖుస్థాపన కార్యక్రమం లో పాల్గంటారు. అనంతరం మధ్యాహ్నం జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గనేందుకు కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం ననియాల ఫారెస్ట్‌ ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద జన్మభూమి సభకు ముఖ్యమంత్రి వస్తున్నారని , అదేరోజు రాత్రి కుప్పం లో బస చేస్తారని జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న తెలిపారు. ఈ మేరకు సీఎం పిఏ మనోహర్‌, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ బాబు , డిఎఫ్‌ఓ చక్రపాణి లతో కలిసి జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ననియాల ఫారెస్ట్‌ విశ్రాంతి గ అహం సమీపంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దిగడానికి, గ్రామసభకు అనుకూలంగా ఉన్న ననియాల ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద హెలిప్యాడ్‌ స్థలాన్ని, సభా వేదిక, ఎగ్జిబిషన్‌ స్టాల్ల్స్‌, సాంస్క అతిక కార్యక్రమాలు, శంఖుస్థాపనలు, ననియాల ఎలిఫెంట్‌ క్యాంప్‌ టూరిజం ప్రాజెక్టు తదితర ప్రారంభోత్సవాల శిలాఫలకాల ఆవిష్కరణ లకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం, ననియాల ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద అధికారులతో కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఈ నెల 9న ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో పోలీసు, ఫారెస్ట్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులు సమన్వయం చేసుకుని వెంటనే ఏర్పాట్లను మొదలుపెట్టి పగడ్బందీగా చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌ నిర్మాణం పనులను వేగవంతంగా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం చేయాలని, సభా స్థలి చదును ఏర్పాట్లను చేయాలని రహదారులు, భవనాల శాఖ ఈఈ హరిప్రసాద్‌ ను కలెక్టర్‌ ఆదేశించారు.