ఈ నెల 7 నుంచి కాంగ్రెస్ మ‌హాపాద‌యాత్ర‌

Congress Party
Congress Party

రాష్ట్రంలోని పోలవరంతో పాటు రాష్ట్రంలోని 43 సాగునీటి ప్రాజెక్టులను 2018లోపు పూర్తిచేసి రైతులకు నీరందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఈనెల 7వ తేదీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 7న పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పాదయాత్ర కార్యక్రమాన్ని మౌళేశ్వరం వద్ద ప్రారంభిస్తారు. 7 నుంచి 9 వరకు పాదయాత్ర నిర్వహించి, 10న పోలవరం నిర్వాసితులతో కలిసి సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే పాల్గొంటారు.