ఈ నెల 26 నుంచి డిగ్రీ లెక్చ‌ర‌ర్ల ఇంట‌ర్వ్యూలు

interview
interview

హైద‌రాబాద్ః బీసీ, ఎస్సీ గురుకులాల్లోని డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఈ నెల 26 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు సెక్రటరీ వాణీప్రసాద్‌ మంగళవారం తెలిపారు. 26, 27న తెలుగు, 28, 29న కామర్స్‌, 30న మైక్రోబయాలజి, డిసెంబరు 1న బాటనీ, 3న జువాలజి, సోసియాలజీ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 22న వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు.