ఈ నెల 26న టిడిపి కార్యాల‌యం శంఖుస్థాప‌న‌

TDP
TDP

గుంటూరుః ఏపీలో నిర్మించదలచిన టీడీపీ జాతీయ కార్యాలయం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏ.వి.రమణ ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద నిర్మించే ఈ కార్యాలయ శంకస్థాపన ముహూర్తాన్ని ఈ నెల 26న ఉదయం 5.17 గంటలకు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భవన నిర్మానానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మొత్తం నాలుగు బ్లాక్‌లుగా పార్టీ నూతన కార్యాలయ నిర్మాణం జరుగుతుందని, ఇప్పటికే పార్టీ ఆఫీస్‌ డిజైన్‌ను సీఎం చంద్రబాబు ఆమోదించారని ఏ.వి.రమణ వెల్లడించారు.