ఈ నెల 20 వరంగల్ పర్యటనలో కేటిఆర్

వరంగల్: ఈ నెల 20న ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పర్యటించనున్నారు. పాత వరంగల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో కేటిఆర్ సమావేశం పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను కడియం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ..కేటిఆర్ పంచాయితీ, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా శ్రేణులను సన్నద్ధం చేసి దిశానిర్ధేశం చేస్తారని తెలిపారు. వరంగల సమావేశం అనంతరం జనగామ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.