ఈ నెల 17న ప్ర‌మాణ స్వీకారమే..

YEDURAPPA
YEDURAPPA

బెంగ‌ళూరుః కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. శిఖరిపురిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. బీజేపీకి భారీ విజయం ఖాయమన్న ఆయన.. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం మే 15న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని పేర్కొన్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురిని ఆహ్వానిస్తానని యడ్యూరప్ప తెలిపారు. 224 స్థానాలకు గానూ 145 నుంచి 150 స్థానాల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.