ఈ నెల 15న సంక్రాంతి

PONGAL
PONGAL

హైద‌రాబాద్ః సంక్రాంతి 14నా లేక 15నా అనే కన్ఫ్యూజన్‌కు తెర పడింది. మకర సక్రాంతి ఈ నెల 15న జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ స్పష్టం చేసింది. జనవరి 14 న బోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగలను జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి వెల్లడించారు. 14న రాత్రి 7.15కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడని.. మరుసటి రోజును సంక్రాంతిగా జరుపుకోవాలని విద్వత్సభ స్పష్టం చేసింది. ఇదివరకు జరిగిన జ్యోతిష సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారిని విద్వత్సభ ప్రతినిధి బృందం కలిసి సంక్రాంతి సెలవులకు సంబంధించిన పత్రాన్ని అందజేసింది.
సోషల్ మీడియాలో పండుగపై పుకార్లు వచ్చిన సందర్భంగా వాటిలో ఎటువంటి వాస్తవం లేదని విద్వత్సభ స్పష్టం చేసింది. పంచాంగం ప్రకారమే తాము ఈ తేదీలను ఇదివరకే ప్రకటించామని.. వాటి ఆధారంగానే ప్రభుత్వం కూడా సెలవులను ప్రకటించిందని సిద్ధాంతి గుర్తు చేశారు.