ఈ నెల 12న వారిరువురి భేటీ

KIM, TRUMP
KIM, TRUMP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య భేటీ ప్రక్రియ మళ్లీ ట్రాక్‌లో పడింది. ఆ ఇద్దరూ ఈ నెల 12వ తేదీన సింగపూర్‌లో కలుసుకోనున్నారు. కిమ్‌తో భేటీని రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ట్రంప్‌, మళ్లీ ఆ అంశంపై తాజాగా ఓ ప్రకటన చేశారు. ముందుగా అనుకున్నట్లే ఈనెల 12న కిమ్‌తో భేటీ ఉంటుందని ట్రంప్‌ వైట్‌హౌజ్‌లో మీడియా సమావేశంలో తెలిపారు. నార్త్‌ కొరియాకు చెందిన సీనియర్‌ నేతతో మంతనాలు జరిపిన తర్వాత ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.