ఈ దీపావ‌ళికి వాహ‌నాలు, గృహోప‌క‌ర‌ణాల‌ కొనుగోలే అధికం

vehicles
vehicles

ఈ దీపావళి పండగ సీజన్ లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారికన్నా, నూతన వాహనాలు కొనుగోలు చేస్తున్నవారే అధికంగా కనిపిస్తున్నారు. వాహనాలతో పాటు నూతన గృహోపకరణాల అమ్మకాలు తృప్తికరంగా సాగుతుండగా, బంగారం విక్రయాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఇండియాలో సంవత్సరం మొత్తం సాగే అమ్మకాల్లో దసరా, దీపావళి పండగ సీజన్ వాటా 30 శాతం ఉంటుంది. ఎందుకంటే పలు రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి కాబట్టి. దీనికితోడు సులభ వాయిదాల సదుపాయం ఉన్నా కూడా బంగారం పై ఉండే మోజును వాహనాలు, గృహోపకరణాలవైపు మళ్లేలా చేశాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.