ఈ తరం అమ్మాయిలకు ప్రతినిధిగా కన్పిస్తా

Kajal Agarwal
బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెలియగానే..తను నటిస్తున్న పాత్ర ఎంలా ఉండతుందోనని రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.. అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ ‘బ్రహ్మోత్సవం’ తనపాత్ర ఎలా ఉండబోతుందో కాజల్‌ అగర్వాల్‌ స్వయంగా వివరించారు. ‘బ్రహ్మోత్సవం’లో నేను పోషిస్తున్న పాత్ర ఇప్పటి తరం అమ్మాయిలకు ప్రతినిధిగా ఉంటుంది.. జీన్స్‌, స్కర్ట్‌ వేసుకున్నా అమ్మాయిల్లో ఉండే సహజమైన అందం, స్త్రీతత్వం నా పాత్రలో కన్పిస్తాయి..నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన దానిలా కన్పిస్తాను.. జీవితంలో ఏం కావాలి వాటిని ఎలా సాధించుకోవాలి అన్నది నా పాత్ర తత్వం..కలల్లో బ్రతికే అమ్మాయిగా కన్పించినా వాస్తవంగా కూడ ఆలోచిస్తాను..అని తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది..

ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’లోనూ నటిస్తున్న కాజల్‌ , పవన కళ్యాణ్‌తో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో కూడ నటిస్తోంది.. తను రణ్‌దీప్‌ హుడాతో కలిసి నటించిన హిందీ చ్తిరం  దో లఫోటన్‌కి కహాని రిలీజ్‌ కావాల్సి ఉంది.