ఈ ఏడాది నేరాల సంఖ్య తక్కువ

mahesh bhagat
mahesh bhagat

హైదరాబాద్‌: గతేడాదితో పోలిస్టే ఈ ఏడాది రాచకొండ పరిధిలో నేరాలు తగ్గినట్లు సిపి మహేశ్‌ భగవత్‌ తెలిపారు. షీ బృందాలు ఈ ఏడాది 516 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వరకట్న కేసులను కూడా చాలా చాకచక్యంగా ఎదుర్కోని పరిష్కార మార్గాలను సూచించామన్నారు. ఆపరేషన్‌ స్మైల్‌ కింద 210 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు చెప్పారు. వ్యభిచార గృహాల నుంచి యువతులను కాపాడేందుకు కృషి చేశామన్నారు. గొలుసు చోరీ కేసులను, హత్య కేసులను ఛేదించామని సిపి అక్రమంగా ఆయుధాలు కలిగిన వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమ పేలుళ్ల కేసులలో 43 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సిబ్బంది కొరత ఉన్నా కాని శాంతిభద్రతలు, నేర సమాచారంపై ఏ విఘాతం కలగకుండా నడుచుకున్నామని అన్నారు.