ఈ ఎనిమిది రోజులు కీలకం

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల వేళ రాబోయే ఎనిమిది రోజులు అవిశ్రాంతంగా పని చేయాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. సంస్థాగత బలమే టిడిపి బలమని ఈ ఎన్నికల్లో సాంకేతికత టిడిపికి కలిసొచ్చే అంశమని అన్నారు.సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు పట్టుదలగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. బూత్ కన్వీనర్ కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.ప్రతి బూత్‌లో ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని, తెదేపాకు అందరి మద్దతు సాధించాలని వారికి సూచించారుక. చెప్పారు. వీప్యాట్ రశీదులపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని, వీటి ఉపయోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఐదేళ్లలో పేదల సంక్షేమం సంతృప్త స్థాయికి చేర్చామని, పారదర్శకంగా ప్రతి పైసా లబ్దిదారుడి ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని, నెలకు రూ.3వేల రూపాయలు పింఛను, 150 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా రూ.5 లక్షలు, చంద్రన్న బీమా రూ.10 లక్షలు ఇస్తున్నామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో గృహ రుణాలను రద్దు చేశామని, 43 లక్షల పక్కా ఇళ్ల లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరనుందని అన్నారు. వీటన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/