ఈ ఆర్ధిక‌ సంవ‌త్స‌రంలో వ్య‌వ‌సాయానికి ప్రాధాన్యం

jaitly
jaitly

న్యూఢిల్లీః 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెద్ద పీట వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ. 14.34 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. వ్యవసాయానికి క్రెడిట్ కింద రూ. 11 లక్షల కోట్లను అందిస్తామని చెప్పారు. నేషనల్ బాంబూ మిషన్ కింద వెదురు రంగానికి రూ. 1290 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఫిషరీ, ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ. 10 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉజ్వల స్కీమ్ కింద మహిళలకు 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇచ్చామని తెలిపారు.