ఈ అన్యాయపు వసూళ్లను తక్షణం ఆపాలి
టిడిపి నేత దేవినేని ఉమ

అమరావతి: ఏపిలో విద్యుత్ స్లాబుల రేట్లు రెట్టింపు చేయడంపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించిన జగన్ ఇపుడు విద్యత్ స్లాబుల రేట్లను పెంచడంపై టిడిపి నేత దేవినేని ఉమ మండిపడ్డాడు. ఇందుకు సంబందించి గతంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సంపద సృష్టి చేత కాని మీ ప్రభుత్వం ఎన్నికల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం అనిచెప్పి, నేడు కరోనా లాక్డౌన్ సమయంలో స్లాబుల రేట్లు రెట్టింపు చేసి బాదుడు మెదలెట్టారు. ఈ అన్యాయపు వసూళ్లను తక్షణం ఆపాలని ప్రజలు అడుగుతున్నారు, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/