ఈసి తీరును తీవ్రంగా తప్పుపట్టిన కళా వెంకట్రావు

అమరావతి: ఈసి తీరును టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడంలేదని అన్నారు. ఏపి అడిషనల్‌ సిఈఓ సుజాత శర్మను కళా వెంకట్రావు కలిసి, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ బూత్‌ల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. వీటిలో రీపోలింగ్‌ జరగాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూత్‌లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఎందుకు ఆదేశించలేదని అడిగారు. కానీ వైఎస్‌ఆర్‌సిపి నేతలు కొన్ని బూత్‌లపై ఫిర్యాదు చేస్తే సీఈఓ విచారణకు ఆదేశించారు. ఈసి చిత్తశుద్దిని శంకించాల్సి వస్తుందని కళా వ్యాఖ్యానించారు. సిఈఓ ద్వివేది సెలవు నుంచి వచ్చాక టిడిపి ఫిర్యాదుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుజాత శర్మ హామీ ఇచ్చారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/