ఈవెంట్ కు ప్రభాస్ వచ్చే అవకాశాలు

Prabhas
Prabhas

అనుష్క ప్రధాన పాత్రలో జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా భాగమతి. బాహుబలి 2′ తరువాత అనుష్క నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘భాగమతి’పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉండబోతోందని దర్శకుడు అశోక్ నమ్మకంగా చెబుతున్నాడు. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ప్రభాస్ ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. రెండు విభిన్న పాత్రల్లో అనుష్క ఈ సినిమా నటించింది. ట్రైలర్ అలరించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోందని ఆశిద్దాం.