ఈవిఎం ట్యాంపరింగ్‌ పిటిషన్‌పై కాంగ్రెస్‌కు చుక్కెదురు

Supreme Court
Supreme Court

దిల్లీ: గుజరాత్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్‌ ఎన్నికల్లో ఈవిఎం ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపించిన గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ 25శాతం వివిపాట్‌ పేపర్‌ ట్రయల్‌ను ఈవిఎంతో సరిపోల్చి చూడాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈవిఎంల టాంపరింగ్‌ జరిగిందనడానికి ఆధారాలు ఉంటే సమర్పించాలని కాంగ్రెస్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వికి సూచించింది. మరోవైవు గుజరాత్‌ ఎన్నికల పోలింగ్‌ అంతా సక్రమంగానే జరిగిందని, ఎలాంటి అవకతవకలు జరగలేదనిన ఎన్నిక సంఘం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఈవిఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఏలాంటి స్పష్టమైన ఆధారాలు లేనందని పిటిషన్‌ను తోసిపుచిచనట్లు న్యాయస్థానం తెలిపింది. పోలింగ్‌ ముగిసినందున తర్వాతి ప్రక్రియను కొనసాగించేందుకు న్యాయస్థానం అనమతిచ్చింది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు దశల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో మళ్లీ బిజెపినే అధికారంలో వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.