ఈవిఎంలే సరైన ఆప్షన్‌

nitish kumar, bihar cm
nitish kumar, bihar cm

పాట్నా: ఎన్నికల నిర్వహణలో ఈవిఎంలే బెటర్‌ అని బీహార్‌ సియం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈవిఎంలతోనే ఓటింగ్‌ నిర్వహించాలని, అవే సరైన ఆప్షన్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి బూత్‌లోనూ వివిప్యాట్‌లను పెట్టాలని ఆయన సూచించారు. ఈవిఎంలు వచ్చిన తర్వాతే ఓటింగ్‌ శాతం పెరిగిందని నితీశ్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన మహా కూటమి మీటింగ్‌లో కొందరు నేతలు ఈవిఎంలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కామెంట్‌ చేశారు.