ఈరోజు మహేశ్వరంలో రాజ్‌నాథ్‌సింగ్‌ బహిరంగ సభ

Rajnath singh
Rajnath singh

హైదరాబాద్: కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మహేశ్వరంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ నాయకుడు పాపయ్యగౌడ్‌లు పిలుపునిచ్చారు. బుధవారం రాజ్‌నాథ్‌సింగ్‌ సభకోసం ఏర్పాట్లను హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్‌నాథ్‌ సభకు మహేశ్వరం కందుకూరు మండలాలల నుంచి 20 వేల మంది తరలిరానున్నట్లు తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్‌ సభాస్థలాన్ని పోలీసులు, ఇంటెలిజెన్స్‌, ఎన్‌.ఎ్‌స.జి. అధికారులు కుడా పరిశీలించి సభా స్థలిని వారి ఆధీనంలోకి తీసుకున్నారు.