నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినం

World AIDS Day
World AIDS Day

ఎయిడ్స్‌కు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పటికీ మూడో అతి పెద్ద ఎయిడ్స్‌ బాధిత దేశంగా భారత్‌ కొనసాగటం ఆందోళన కలిగించే అంశం. దేశంలో 201718లో 86 శాతం వ్యాధులు లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించినట్లు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థలు ప్రకటించాయి. ముఖ్యంగా అరక్షిత లైంగిక సంపర్కం ఈ దుస్థితికి కారణం. సమర్థ చికిత్స, మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ నేటికీ రోజూ సగటున 241 మంది హెచ్‌ఐవీకి బలవుతుండటం ఆందోళనకర పరిణామం. కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఎయిడ్స్‌ నివారణ సంస్థ తాజా గణాంకాల ప్రకారం హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ వాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి 2017 లెక్కల మేరకు దేశంలో 46 శాతం మేరకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. 2010తో పోల్చుకుంటే 22 శాతం వరకు ఎయిడ్స్‌ సంబంధిత మరణాలు తగ్గాయి. 2024 నాటికి హెచ్‌ఐవీ వ్యాప్తి 50 శాతం తగ్గింపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం  కృషి చేస్తోంది.