ఈరోజు నామినేషన్‌ వేయనున్న కుమారస్వామి భార్య

KUMARA SWAMY
KUMARA SWAMY

బెంగాళూరు:  ఉప ఎన్నిల నామినేషన్లకు జేడీఎస్‌ తన అభ్యర్థులను ఖారూరు. చెసింది. రామనగర్‌ శాసనసభ స్థానానికి సీఎం భార్య అనితా కుమారస్వామి పేరు మూడు రోజులక్రితమే ఖరారు కాగా, మండ్య, శివమొగ్గ ఎంపీ స్థానాలకు ఆదివారం మధ్యాహ్నం అభ్యర్థులను ఖరారు చేశారు. మండ్య నియోజకవర్గానికి భారీగా పోటీ నెలకొన్నా చివరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ తన రాజకీయ అనుభవంతో శివరామేగౌడ పేరును ఖరారు చేశారు. రిటైర్డు అధికారి లక్ష్మి అశ్విన్‌గౌడ పేరు ప్రధానంగా వినిపించినా రాజకీయ అనుభవం లేనందున చివరిక్షణంలో మార్చారు.