ఇస్రో శాస్త్రవేత్తకు కోర్టులో ఊరట

NAMBI NARAYANAN
NAMBI NARAYANAN

న్యూఢిల్లీ: ఇస్రో గూఢచర్యం కేసులో.. కేరళ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. వేధింపులకు గురైన సైంటిస్టు నారాయణన్‌కు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. ఇస్రో గూఢచర్యం కేసులో ఆయన్ను అన్యాయంగా అరెస్టు చేసి వేధించారని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. అన్యాయంగా అధికారులు తనను వేధించారని వారి పట్ల చర్య తీసుకోవాలని ,నష్టపరిహారం చెల్లించారిన శాస్త్రవేత్త నారాయణన్‌ కోర్టును ఆశ్రయించారు. ఐతే కోర్టు శాస్త్రవేత్తను వేధించిన అధికారులే నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొంది. 1994, నవంబరు 30న కేరళ పోలీసులు దేశద్రోహం కేసులో నారాయణ్‌ను అరెస్టు చేశారు.