ఇసుక మాఫియాపై సీఎంకు వాట్సాప్‌లో కామెంట్‌

 

Palani swamy
Palani swamy

తమిళనాడు (వేలూరు): పాలారులో ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రిని, కలెక్టర్‌ను విమర్శిస్తూ వాట్పాప్‌లో పోస్ట్‌ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ యువకుడు వేలూరు జిల్లా వాలాజ సమీపంలో తిరుమలచ్చేరి గ్రామానికి చెందిన విఘ్నేష్‌ (31)గా పోలీసులు గుర్తించారు. ఆయన ఎమ్మెస్సీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. వాలాజ వీసీ మోటూరు, రాణిపేట, ఆర్కాడు ప్రాంతాల్లో ఇసుక మాఫియాపై విఘ్నేష్‌ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయాల్లో తరచుగా ఫిర్యాదులు చేసేవాడు. ఫిర్యాదులకు స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో ఇసుక రవాణాను అరికట్టడానికి సీఎం పళనిస్వామి, కలెక్టర్‌ రామన్‌ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ ప్రభుత్వంపై విఫలం అనే రీతిలో స్ఫురించే విధంగా తన మిత్రులకు పోస్ట్‌ చేశాడు. ఇసుక అక్రమ రవాణా మూలంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారంటూ, దానిని అరికట్టాలని కోరేవాడు. వీటిపై వీఏవో సంపత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విఘ్నేష్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.