ఇష్టంలేని వివాహం చేశారని నవ వధువు ఆత్మహత్య

Suicide
Suicide

రోలుగుంట: విశాఖపట్నం జిల్లా కొండపాలెంలో గురువారం ఓనవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పిల్లా భూలక్ష్మికి అధికారి శ్రీనివాస్‌తో రెండు నెలల క్రితమే పెద్దలు వివాహం చేశారు. ఆషాడా మాసానికి భూలక్ష్మి స్వగ్రామనికి వచ్చింది. తిరిగి గురువారం అత్తగారి ఇంటికి పంపించేందుకు తల్లి, ఇతర పెద్దలు అనడంతో తాను అత్తవారింటికి వెళ్లనని తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని చెప్పింది. పెద్దలు బందువులు నచ్చజెప్పి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం అర్ధరాత్రి గ్రామ శివార్లలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.