ఇషా, ఆనంద్‌ పెళ్లి ఖర్చు 100 మిలియన్‌ డాలర్లు

ambani family
ambani family

ప్రిన్స్‌ఛార్లెస్‌, డయానా వేడుకలతో సమానం
ముంబయి: ముకేష్‌ అంబాని ఇంట పెళ్లి సందడి అంటే ఇక ఎంత హోదాతో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. హెలికాప్టర్లు, చార్టర్డ్‌ విమానాల్లో వచ్చే అతిధులు దేశవిదేశాలనుంచి వచ్చే ప్రముఖులకు ఇచ్చే ఆతిధ్యం మాటల్లో చెప్పలేం. ఇపుడు తాజాగా ఇషా అంబాని, ఆనంద్‌పిరమల్‌ వివాహం ఖర్చు అంచనా 100 మిలియన్‌డాలర్లు పైనే ఉంటుందని అంచనా. ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ డయానా పెళ్లి 37 ఏళ్లక్రితం జరిగినపుడు అయిన ఖర్చు 110 మిలియన్‌ డాలర్లుగా చెపుతుంటారు. అదే కోవలో ఇపుడు అంబాని ఇంట వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకలుగా నమోదవుతున్నది. బుధవారం ఆసియాలోనే సంపన్నుడైన ముకేష్‌ అంబాని ఏకైక కుమార్తె ఇషాను బిలియనీర్‌ అజ§్‌ు పిరమల్‌ కుమారుడు ఆనంద్‌కు వచ్చి వివాహంజరిపిస్తున్నారు. పెళ్లికి ముందజరిగే సంగీత్‌ సమారోహ్‌ వంటి వేడుకలకు ఉద§్‌ుపూర్‌ను వేదికచేసి అంతర్జాతీయ సెలబ్రిటీలను బియోన్స్‌ వంటి ప్రముఖులు, హిల్లరీక్లింటన్‌, బిజినెస్‌ దిగ్గజాలు హెన్రీ క్రావిస్‌ వంటివారిని ఆహ్వానించారు. అంబాని అతిధుల జాబితా అత్యంత పొడవైనదే. సమీపంలోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లు అన్నింటిలోను గదులు బుక్‌చేసారు. సుమారు 100కుపైగా చార్టర్డ్‌ విమానాలు ఉద§్‌ుపూర్‌లోని మహారాణాప్రతాప్‌ ఎయిర్‌పోర్టునుంచి ఎగిరేందుకు సిద్ధంచేసారు. మొత్తం నాలుగురోజులపాటు 5100 మందికి రోజు అన్నదానం నిర్వహించారు. మొత్తం 108 సాంప్రదాయక భారతీయ పెయటింటింగ్స్‌, చేతివృత్తులు, స్థానిక కళాకృతులు వంటివాటిని అమర్చారు. ఇక ప్రధాన వివాహ వేడుక ముంబయిలోని 27 అంతస్తుల సొంతభవనం యాంటిలియాలో జరుగుతుంది. రిలయన్స్‌ఛైర్మన్‌గా ఇటీవలే ముకేష్‌ అంబాని ఆన్‌లైన్‌ దిగ్గజం ఆలిబాబాఛైర్మన్‌ జాక్‌మాను అధిగమించి ఆసియాలోనే కుబేరునిగా నిలిచారు. కుటుంబంలో ఇషా మొట్టమొదటి సంతానంగా వివాహం జరిపిస్తున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు ముంబయిలోని 64 మిలియన్‌ డాలర్ల ఖరీదైన గులిటా భవనంలోనికి మారతారు. మొత్తం మీద ప్రిన్స్‌ఛార్లెస్‌,డయానా వివాహం తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా అంబాని ఇంట పెళ్లివేడుకలు నిలిచాయని పారిశ్రామికరంగంలో బహుముఖంగా వినిపిస్తోంది.