ఇషా-ఆనంద్‌ల ప్రీ వెడ్డింగ్‌కు హాజరైన ప్రముఖులు

isha-anand pre wedding celebrations
isha-anand pre wedding celebrations

ఉద§్‌ుపూర్‌: ప్రముఖ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి, ఫార్మా ఇండస్ట్రియలిస్ట్‌ అజ§్‌ు పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌లో వివాహం ఈ నెల 12న జరగనుంది. డిసెంబరు 8,9తేదీల్లో వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. రాజస్థాన్‌లోని ఉద§్‌ుపూర్‌లో పెళ్లి వేడుకలు ప్రారంభమయినాయి. శుక్రవారం నుంచే ప్రముఖుల రాకతో ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి నెలకొంది. ఈ వేడుకల్లో హిల్లరీ క్లింటన్‌, సచిన్‌ దంపతులు, ప్రియాంక దంపతులు, ధోనీ , విద్యాబాలన్‌, జాన్‌ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. అతిథులు దిగే హోటళ్ల వద్ద భద్రతకు భారీగా పోలీసులను నియమించారు.