ఇవి ఉంటే పని సులువే

COOKING55
ఇవి ఉంటే పని సులువే

రెండు అరలుగా ఉండే స్టీమర్లు సింపుల్‌ పాట్స్‌, అడుగుభాగం నీటిని వేడిచేస్తే, పైభాగంలో పదార్థాలుంటాయి లేదా రెండు అరల రైస్‌కుక్కర్‌ మాదిరి ఉంటాయి. స్టీమర్లలో పదార్థాల్ని తయారుచేసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు నష్టపోకుండా ఉంటాయి. ఎక్కువ నీరుపోసి పదార్థాలు వండడం వల్ల పోషకాల్ని కోల్పోవాల్సి ఉంటుంది. స్టీమ్‌ చేసే పదార్థాల్లో ఆ నష్టం జరగదు. స్టీమర్‌లో పదార్థాల రంగు బ్రైట్‌గా అయ్యే వరకు మాత్రమే ఉడికించాలి. ఉదాహరణకు నిండు రంగు బ్రొకోలి మరింత బ్రైట్‌గా మారుతుంది. క్యాలీఫ్లవర్‌ వంటివి సగం తెల్లదనం నుంచి ఇంకొంత తెల్లగా మారతాయి. అత్యధిక పోషకాలు కావాలనుకునే వారు రెండుమూడు నిమిషాలు స్టీమ్‌ చేస్తే చాలు. శాకాహారులకు ఐరన్‌ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇనుపమూకుళ్ళు, పెనాలు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉడికించే పదార్థాల్లో ఐరన్‌ చేరుతుంది. పెనంపై ఉల్లిపాయ ముక్కతో 30సెకండ్లు రాయడం వల్ల దోసెలు, పాన్‌కేక్‌లు అంటుకోకుండా రావడమే కాక, దోసె క్రిస్పీగా ఉంటుంది. వీటివల్ల నూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు. కొద్దిపాటి నూనెను స్ప్రే చేస్తే చాలు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఖాళీ వాటిలో కావాల్సినంత నూనె నింపుకోవచ్చు లేదా నూనె నింపిన రకాలుంటాయి. ఆలివ్‌ ఆయిల్‌తో నింపిన స్ప్రిట్జర్లు కూరల్ని వేయించుకోవడానికి, బేకింగ్‌ ప్యాన్లు గ్రీజ్‌ చేయడానికి అనువ్ఞగా ఉంటాయి. నూనె వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోగల స్ప్రిట్జర్లు బరువ్ఞ తగ్గాలనుకునేవారికి, కేలరీల నియంత్రణకు అవసరమైన పనిముట్టు. మిగతా ఆయిల్‌ కంటెయినర్ల వల్ల నియంత్రణ లేకుండా ఒక్కసారిగా నూనె ఒంపేస్తుంటాం. ఈ స్ప్రిట్జర్ల వల్ల నియంత్రణ ఉంటుంది. ఖాళీ పరికరం కొన్నట్లయితే ప్రతినెలా ఆయిల్‌ను మార్చి మార్చి నింపుతుండాలి. దీనివల్ల ఆహారంలో గుండెకు ఆరోగ్యవంతమైన పాలీ అన్‌సాచ్యురేటెడ్‌, మోనో అన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ను సమంగా వాడే వీలుంటుంది. బరువ్ఞపై కన్నేసి ఉంచినప్పుడు తీసుకునే మోతాదుది కీలకపాత్ర. కాబట్టి తప్పనిసరిగా కొలత కప్పులు, స్పూన్లు వాడాలి. ఊహించి, స్పష్టంగా ఎంత కావాలో, అంతే వాడుకోగల వీలుంటుంది. తీసుకునే క్యాలరీల్ని అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ముప్పావ్ఞ కప్పు డ్రైసెరల్‌ (వీట్‌ఫ్లేక్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌) ఒక సర్వింగ్‌ స్టార్చ్‌కు, ఒక కప్పు రా సలాడ్‌ ఒక వెజిటబుల్‌ సర్వింగ్‌కు సమానం. సాధారణ ఆహార నిబంధన మేరకు ఒక్కో వ్యక్తికి రోజుకు రెండు టేబుల్‌స్పూన్ల నూనె చాలు. కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే ఉదయాన్నే ఓ పది స్పూన్ల నూనె పక్కన పెట్టేసుకుని, దానికీ వాడకాన్ని పరిమితం చేసుకోవాలి. ఇలా కొలతలు అవసరం. నూనెవాడకాన్ని బాగా నియంత్రించు కోవాలంటే మంచి మార్గం నాన్‌స్టిక్‌ వంటపాత్రలు వాడడం. వీటిలో తగు మాత్రం నూనెతో పదార్థా లు అంటుకోకుండా వంట ముగిం చుకోవచ్చు.