ఇవిఎం సైబర్‌నిపుణునిపై ఎన్నికలసంఘం ఫిర్యాదు

evm
evm

భారత చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు
న్యూఢిల్లీ: ఇవిఎంలను హ్యాకింగ్‌ చేయవచ్చన్న సైబర్‌నిపుణునిపై కేసు నమోదుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు లేఖరాసింది. తనకుతానుగానే సైబర్‌ నిపుణుడిగా చెప్పుకున్న ఈ వ్యక్తి 2014 ఎన్నికల్లో బిజెపి ఇవిఎంలను హ్యాకింగ్‌చేయడంద్వారా గెలుపొందిందన్న భావన తీసుకునివచ్చారు. సయ్యద్‌ షైజా లండన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఇవిఎంలు దుర్వినియోగంచేసారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఈ ఆరోపణను తీవ్రంగా తీసుకుని ఢిల్లీపోలీసులకు కేసునమోదుచేయాలని నమోదుచేసింది. భారత ఎన్నికల సంఘం వినియోగించిన ఇవిఎంలు హ్యాకింగ్‌కు ఎంతో సులువైనవని సయ్యద్‌ వెల్లడించారు. న్యూఢిల్లీ డిసిపికి లేఖరాస్తూ ఇలాంటి వాదనలు చేసిన షూజా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఐపిసి సెక్షన్‌ 505(1)(బి)ప్రకారం శిక్షార్హం అవుతుందని వెల్లడించారు. సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు తమతమ తీర్పుల్లో ఎన్నికల్లో ఇవిఎంలను మాత్రమే వినియోగించాలనిసూచించాయని, వివిద రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలపై ఎన్నికల సంఘం జూన్‌ 2017లో బహిరంగసవాల్‌ను కూడా విసిరిందని ఇసి వెల్లడించింది. అంతేకాకుండా ఇవిఎంలలో ఎలాంటి లోపాలున్నా సైబర్‌నిపుణులు నిరూపించాలని కూడా కోరింది. తాముచేసిన సవాల్‌కు ఏ ఒక్కరూ స్పందించలేదని, ఎన్నికల సంఘం తన ఫిర్యాదులో వివరించింది. దీన్నిబట్టి భారత చట్టాలను షూజా ఉల్లంఘించారని వెల్లడించారు. అమెరికాలో ఉంటున్న షూజా లండన్‌లో స్కైప్‌ద్వారా మీడియా సమావేశం నిర్వహించి ఇవిఎంల డిజైన్‌టీమ్‌లో తాను కూడా సభ్యుడినేనని అవసరమైతే తాను హ్యాకింగ్‌చేయగలనని కూడా వెల్లడించాడు.