ఇలా నడవండి..

walkinggg
walking

ఇలా నడవండి..

ఒకేసారి కదలికలు ప్రారంభమై కండరాల్లో సమస్యలు రాకుండా ఉండాలంటే వాకింగ్‌కు వెళ్లేముందు కండరాలను స్ట్రెచ్‌ చేయాలి. ్య మొదట కొద్దినిముషాలు మెల్లగా నడవడం ద్వారా శరీరాన్ని, కాళ్లని వాకింగ్‌కు సిద్ధం చేయండి. నడిచే సమయంలో శరీరాన్ని అటూ ఇటూ వంచకుండా నిటారుగా నిలబడి, తలను స్థిరంగా ఉంచండి. ్య భుజాలను రిలాక్స్‌గా ఉంచండి. చేతులు అటూ, ఇటూ ఊగడానికి అనువుగా వదులుగా వదిలేయండి. కుడిచేతి కదలిక, ఎడమకాలుకు అనువుగా, ఎడమచేతి కదలిక కుడికాలికి అనువుగా ఒక రిథమ్‌లో కదలాలి. భుజాలు, పిరుదులు ఒకే రేఖలో ఉండాలి.

అలాగే రెండు చేతుల కదలిక ఒకేలా ఉండాలి. ్య వాకింగ్‌ చేసేటపుడు అడుగులు ఒకేరేఖలో సమానదూరంలో పడుతుండాలి. ప్రతి అడుగు వేసేటపుడు పిరుదులు, మోకాళ్లభాగాన్ని సున్నితంగా సాగదీసినట్టుగా చేయండి. పాదం మొత్తం నేలకు ఆనుకునేలా పెట్టాలి. ్య కాలి మడమభాగం మొదట భూమిని తాకాలి, తరువాత శరీరబరువు మొత్తం పాదం మధ్యభాగం మీద వేసి చివరికి కాలివేళ్లను భూమిమీద ఆన్చాలి. ్య వీపు కింది భాగాన్ని వీలయినంతవరకు నిటారుగా చక్కగా ఉంచేలా ప్రయత్నం చేయండి. ్య తల మీ అడుగులకు అనుగుణంగా లయబద్ధంగా మంద్రంగా ఊగుతుండాలి. ఇది మరీ ఎక్కువయితే మెడ పట్టేసే అవకాశం ఉంది. ్య ఇక నడకను పూర్తిచేసేపుడు కూడా మొదలుపెట్టినపుడు చేసినట్టే క్రమంగా స్లో చేయాలి. వార్మింగ్‌ అప్స్‌కు ఎలాంటి స్ట్రెచ్‌లు చేస్తామో అలాగే చేయండి. ఈ ఎనిమిది సూత్రాలు పాటించి చూడండి నడక మీ ఆరోగ్యంలో ఎంత తేడా తెస్తుందో మీకే తెలుస్తుంది.