ఇరాక్‌లో మళ్లీ పేలిన ‘మానవబాంబు’

IRAQ
11 మంది మృతి, 32 మందికి గాయాలు
ఇరాన్‌ సేనలకు సహకారంగా రంగంలోకి అమెరికా మెట్రోదళాలు
బాగ్దాద్‌ : గత కొంత కాలంగా వరుస బాంబుదాడులతో అతలాకుతలమవుతున్న ఇరాక్‌తో మరో మానవబాంబు 11 మందిని పొట్టనబెట్టుకుంది. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఇరాక్‌ ఈశాన్య జిల్లాలోని రషీదియా ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌లోనికి పేలుడు పదార్ధాల దూసుకు వచ్చిన ఓ ట్రక్‌లోని వ్యక్తి తనని తాను పేల్చేసుకోవటంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయాల పాలైనట్లు పోలీసులు వెల్లడించారు. గత వారం రోజులుగా ఇరాక్‌లోని పలుప్రార్ధనా స్ధలాలే లక్ష్యంగా వరుస దాడులకు ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు పాల్పడుతుండటంతో ఇప్పటికి 300 మందికి పైగా మరణించిన విషయం విదితమే. తాజా పేలుళ్లతో ఇరాక్‌ రాజధానిలోనికి వచ్చే అన్ని రహదారులను మూసేసిన పోలీసులు అణువణువూ పరిశీలించిగాని నగరంలోనికి ఎవరినీ పంపటం లేదు. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతకు ఇరాక్‌ సైన్యానికి సహకరించేందుకు 500 మెట్రో దళాలను పంపిస్తున్నట్లు వాషింగ్టన్‌లో అమెరికా సంయుక్త రక్షణ కార్యదర్శి యాష్‌ కాటన్‌ ప్రకటించారు.