ఇరవై నాలుగు గంటల్లోగా సమాధానం చెప్పాలి: రాష్ట్ర ఎన్నికల కమీషన్‌

 

 

Election commission image
ELECTION COMMISSION

 

వైసీపీ అధినేత జగన్‌కు ఎన్నికల కమీషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. నంద్యాల బహిరంగ సభలో
ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వాఖ్యలు చేసిన నేపథ్యంలో నోటీసులు పంపింది. ఈ మేరకు కలెక్టర్‌
సత్యనారాయణ జగన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఇరవై నాలుగు గంటల్లోగా సమాధానం చెప్పాలని
ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమీషన్‌ సుమోటోగా తీసుకుని
స్పందించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ సత్యనారాయణ నుంచి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌
వివరణ కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే జగన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని
కలెక్టర్‌ను ఆదేశించారు.