ఇయాన్‌ బోథమ్‌ తరువాత స్థానంలో ఒకీఫ్‌

IYAN1111
Iyan

ఇయాన్‌ బోథమ్‌ తరువాత స్థానంలో ఒకీఫ్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఒకీఫ్‌ భారత పర్యటనకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన క్రికెటర్‌.ఈ టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఒకీఫ్‌ పై ఆసీస్‌ కూడా భారీ ఆశలు పెట్టుకోలేదు. భారత్‌ లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి ఒకీఫ్‌కు ఆసీస్‌ జట్టులో స్థానం కల్పించారు.అయితే ఇప్పుడు ఒకీఫ్‌ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.అసలు సొంతగడ్డపై గత 20 మ్యాచ్‌ల్లో ఒక్క పరాజయం కూడా లేని టీమిండియాకు గట్టి షాకిచ్చి సెలబ్రెటిగా అయిపోయాడు.ఈ మ్యాచ్‌లో మొత్తం ఒకీఫ్‌ సాధించిన వికెట్లు 12.తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్న ఒకీఫ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 35 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లను తీసుకున్నాడు.దీంతో తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేసుకున్నాడు.మరోవైపు దిగ్గజాల సరసన కూడా చేరిపోయాడు ఒకీఫ్‌.భారత్‌పై భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండవ బౌలర్‌గా ఒకీఫ్‌ నిలిచాడు.ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ ఇయాన్‌ బోథమ్‌ ముందు వరుసలో ఉన్నాడు.1980 పిబ్రవరి 15వ తేదీన భారత్‌తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్‌ బోథమ్‌ ఒక టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లు సాధించాడు.ఆ తరువాత వరుసగా ఒకీఫ్‌ రెండవ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.ఆపై ఫజూల్‌ మొహ్మాద్‌ పాకిస్థాన్‌,ఏమీ రాబర్ట్స్‌ వెస్టిండీస్‌,డేవిడ్‌ సన్‌ ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఒకీఫ్‌ కీలక పాత్ర పుణే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజం చెందింది.టార్గెట్‌ చేధనకు బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది.తద్వారా చాలా సంవత్సరాల తరువాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ గెలిచింది.ఆస్ట్రేలియా విజయం వెనుక స్పిన్నర్‌ స్టీఫెన్‌ ఒకీఫ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే భారత పర్యటకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చాడు.పుణే టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.భారత్‌లోని పిచ్‌లు అనుకూలిస్తాయి కాబట్టి ఒకీఫ్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించారనే విషయం అందరికి తెలిసిందే.అయితే పుణే టెస్టుల ఒక్కసారిగా ఒకీఫ్‌ సత్తా చాటడంతో హీరోగా మారిపో యాడు. దీంతో భారత్‌లో ఆసీస్‌ మ్యాచ్‌ గెలువడంలో ఒకీఫ్‌ కీలక పాత్ర పోషించాడు. స్వదేశంలో వరుసగా 20 టెస్టుల్లో పరాజయం అనేది లేకుండా దూసుకుపోతున్న భారత్‌కు పుణే టెస్టు గట్టి షాక్‌ ఇచ్చిందనే పేర్కొనాలి.పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన ఒకీఫ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఒకీఫ్‌ ఆస్ట్రే లియన్‌ మాజీ దిగ్గజాల సరసన చేరాడు. భారత్‌లో 2008లో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో ఆసీస్‌ స్పిన్నర్‌ జాసన్‌ క్రేజా నమోదు చేసిన రికార్డును సైతం ఒకీఫ్‌ అధిగమించాడు. మరోవైపు భారత్‌లో ఒఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌ ఒకీఫ్‌ నిలిచాడు.ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్‌ పేసర్‌ ఇయాన్‌ బోథమ్‌ ముందు వరుసలో ఉన్నాడు. 1980 ఫిబ్రవరి 15న భారత్‌తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్‌ బోథమ్‌ ఒక టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లు సాధించాడు.