ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం లేదు

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సార్క్‌ దేశాల అధినేతలతో పాటు ప్రధాని మోదికి కూడా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డాయి. ఐతే ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. 65 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌కు చెందని పాకిస్థాన్‌ తెహ్రికి ఇన్సాఫ్‌ పార్టీ పాక్‌ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.