ఇబ్బందులు రానివ్వని ఆహారం

IndianFood
Indian Food

ఇబ్బందులు రానివ్వని ఆహారం

వయసుతో వచ్చే లక్షణాలను ఆపలేకపోయినా వాయిదా వేయవచ్చు. వయసు లక్షణాలను దాచగలిగిన శక్తి కొన్ని ఆహార పదార్థాలలో వ్ఞంది. వాటిని ఆహారంలో భాగం చేసుకో గలిగితే చాలు. వీటిలో ముఖ్యమైనది అల్లం. ఇది రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరుస్తుంది. కీళ్లనొప్పులు, ఇతర చిన్న చిన్న బాధల నుండి రక్షిస్తుంది. వయసు మళ్లుతున్న సమ యంలో దీనివాడకం కొంచెం పెంచాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి కూరలలో క్యాన్సర్‌ వ్యతిరేక గుణాలున్నాయి.

వీటితో పాటుగా బ్రొకోలి, రాడిష్‌ వంటి వాటిని కూడా రోజులో ఒకసారి ఏదో ఒక దానిని తీసుకోవాలి. అయితే వీటిని పూర్తిగా ఉడికించకూడదు. వెల్లుల్లి చేసే మేలు గురించి తెలిసినదే. ఇది గుండె జబ్బులను, క్యాన్సర్‌ను రానివ్వదు. రక్తంలోని కొలెస్టరాల్‌ని తగ్గించి,రక్తం చిక్కబడకుండా కాపాడుతుంది. బాదం, పిస్తా వంటి ఎండిన పండ్లలో ఉండే పొటాషి యమ్‌, మెగ్నీషియమ్‌, ఐరన్‌, జింక్‌, కాపర్‌ వంటివి జీర్ణ వ్యవస్థను రోగనిరోధక వ్యవస్థను తెలియపరుస్తాయి. వీటివల్ల కొలెస్టరాల్‌ స్థాయి కూడా అదుపులో ఉంటుంది.

పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. రసంగా, ముక్కలుగా తీసుకోవచ్చు. ఎ,బి,సిలు విత్తనాలలోని సెలీనియమ్‌ విటమిన్‌ఇ, జింక్‌లు శరీరంలో ఏర్పడే ఫ్రీరాడి కల్స్‌ మీద చర్య చూపి వయసు లక్షణాలను రానీయవ్ఞ. సోయా ఆడవారికి మరీ మంచిది.