ఇబ్బంది లేకుండా..

Working with Colleagues

పనిప్రదేశాల్లో నవ్వు- అనే విషయం మీద జరిపిన అధ్యయనాలు పనిగంటల్లో కనీసం పది నిమిషాలు హాస్యస్ఫోరక మాటలు, జోకులకు కేటాయించిన కంపెనీలు మంచి ఫలితాలను సాధించాయని చెబుతున్నాయి. పనిచేయకుండా అదేపనిగా నవ్వుతూ ఉండమని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదుకానీ, కాస్త నవ్వు, ఉత్సాహం, ఉల్లాసం కలుపుకుంటే మీ ఆఫీసుపని సజావుగా సాగుతుంది మరి-

పనికి సంబంధించిన ఏ విషయమయినా టీమ్‌లోని ప్రతి ఒక్కరితో చర్చించండి. వివరాలు అందరికీ తెలిసేలా చూడండి. ప్రతిరోజు పని ప్రారంభించే ముందు టీమ్‌లోని సభ్యులందరూ కూర్చుని ఆరోజు చేయాల్సిన పని గురించి చర్చించుకోండి.

‘ఆడుతు,పాడుతు పనిచేస్తుంటే… అనే పాట వినే ఉంటారు. దానిని మీ పనిలోకి ఆహ్వానించండి. అదేపనిగా సీరియస్‌గా పనిచేస్తూపోతుంటే బుర్ర వేడెక్కిపోతుంది. అపుడపుడూ సందర్భాన్నిబట్టి హాస్యాన్ని ఆస్వాదించండి. పనిఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఎంత పనయినా అలవోకగా చేయగలుగుతారు.

నెలలో సాధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు, సహోద్యోగి పుట్టినరోజు, పెళ్ళిరోజు … ఇలా ఏదో ఒక సందర్భాన్ని బట్టి అందరూ కలిసి వేడుక చేసుకోవడంవల్ల టీమ్‌లోని సభ్యుల మధ్య మంచి అనుబంధాలు పెరుగుతాయి. ఆ ప్రభావం చేసే పనిమీద పడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రోజుమొత్తం ఆశావహదక్పథంతో ఉండేలా అలవాటు చేసుకోండి. ఆందోళన పనిచేసే శక్తిని తగ్గిస్తుంది. సమస్యకు ఉన్న అన్ని కోణాలను పరిశీలించి పరిష్క రించుకోవడానికి ప్రయత్నించండి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/