ఇప్పటివరకు అంబేద్కర్‌ బాటలోనే పయనం

TS MINISTER KTR
TS MINISTER KTR

సిరిసిల్ల: అంబేద్కర్‌ సూత్రాలను పాటించే తెలంగాణ సాధించామని రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ పేర్కొన్నారు. శనివారం సిరిసిల్లలో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంబేద్కర్‌ అందరివాడని , కానీ కొందరి వాడిని చేయడం జాతికి మంచిది కాదన్నారు. వ్యక్తులకు రజకీయాల్లోకి వచ్చిన తర్వాతే కులం, మతం జబ్బులొస్తాయన్నారు. తెలంగాణలో అన్ని కులాల్లోని పేదవారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.