ఇన్‌ఫెక్షన్‌ తగ్గించే బెండ

COOKING2
COOKING2

ఇన్‌ఫెక్షన్‌ తగ్గించే బెండ

బెండకాయలోని మ్యూకస్‌ వంటి పదార్థము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ‘సి దీనిలో చాలా ఎక్కువ. మ్యూకస్‌ పదార్థం గ్యాస్ట్రిక్‌ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారం. దీనిలోగల డయూరిటిక్‌ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్షన్‌ ఇంఫెక్షన్‌ను నయం చేయడంలో సహకరిస్తుంది. బెండకాయ డికాషన్‌ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్నచిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక తాగితే టెంపరేచర్‌ తగ్గుతుంది. చక్కెర నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది.

బెండకాయ నిలువ్ఞగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని తాగాలి. ఇలా రెండు వారాల పాటు తాగితే షుగర్‌ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ బ్లడ్‌ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. బెండకాయలో 90శాతం నీరు, 6.4శాతం పిండి పదార్థాలు, 1.9శాతం మాంసకృత్తులు, 0.7శాతం ఖనిజ లవణాలు ఉండి, 33కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి. 66మి.గ్రా, సున్నం 56మి.గ్రా, భాస్వరం 0.30మి.గ్రా, ఇనుము ఉన్నాయి.

కెరోటిన్‌ 52మైక్రోగ్రాములు, 0.07మి.గ్రా. థయమిన్‌, 0.1మి.గ్రా, రైబోఫ్లేవిన్‌, 0.6మి.గ్రా, నియాసిన్‌, ఫోలిక్‌ ఆమ్లం 105 మైక్రోగ్రాములు, ‘సి విటమిను 13మి.గ్రాలు ఉన్నాయి. ఇవేగాక సూక్ష్మధాతువ్ఞలైన మెగ్నీషియ (53మి.గ్రా), సోడియం (6.9మి.గ్రా) పొటాషియం (103మి.గ్రా), రాగి (113మి.గ్రా), మాంగనీస్‌ (149మి.గ్రా) జింక్‌ (417మి.గ్రా) లాంటి సూక్ష్మపరిమాణంలో ఉంటాయి.